నాగులుప్పలపాడు మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో పేకాట ఆడుతున్న 11 మంది జుదారులను అరెస్ట్ చేసినట్లు నాగులుప్పలపాడు ఎస్సై రజియా సుల్తానా ఆదివారం ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుండి రూ. 46, 330/- నగదును సీజ్ చేసి, స్వాధీనం చేసుకొని, సదరు జుదారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రజియా సుల్తానా బేగం మాట్లాడుతూ. మండల పరిధిలో ఎవ్వరూ చెడు వ్యసనాలకు బానిస కావొద్దని హెచ్చరించారు.