నాగులుప్పపాడు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

నాగులుప్పపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రిందపడిన సంఘటనలు ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు బాపట్ల జిల్లా పెద్దగంజం మండలం బుచ్చిగుంట గ్రామానికి చెందిన చిన్న బాబుగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత పనులపై ఉప్పుగుండూరు కు వచ్చిన సమయంలో చిన్న బాబు రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు.

సంబంధిత పోస్ట్