ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి పావని తనిఖీ చేశారు. యూరియా, డి.ఏ.పి ఎరువుల పంపిణీలో ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్ వినియోగాన్ని ఆమె పరిశీలించారు. ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రూపొందించిన ఈ యాప్‌ను డీలర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని ఆమె ఆదేశించారు. ఈ యాప్ ద్వారానే ఎరువుల పంపిణీ జరుగుతుందా లేదా అని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.