ఆటోలో మర్చిపోయిన రూ.50,000 పర్సును తిరిగి అందించిన పోలీసులు

బళ్లమిట్టకు చెందిన టి. విజయ అనే మహిళ గాంధీ రోడ్ వద్ద ఆటో దిగేటప్పుడు రూ.50,000 నగదు, తాళాలు ఉన్న పర్సును మర్చిపోయారు. విషయం తెలియగానే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సీసీటీవీల సహాయంతో ఆటోను గుర్తించి, యజమానిని సంప్రదించారు. ఆటోలోనే పర్సు ఉన్నట్లు తెలియడంతో, ట్రాఫిక్ సీఐ జగదీష్ సమక్షంలో బాధితురాలికి దానిని అప్పగించారు. పోలీసులు సకాలంలో స్పందించి బాధితురాలికి న్యాయం చేశారు.

సంబంధిత పోస్ట్