మద్దిపాడులో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చెన్నారెడ్డి తెలిపారు. మండలంలోని గుండాలపల్లి, గార్లపాడు, గడియాపొడి, బూరేపల్లితో పాటు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఇరువైపులా విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించనున్నారు. ఈ క్రమంలో సదరు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉదయం 8గం. నుంచి సాయంత్రం 3 గం. వరకు నిలిచిపోతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్