త్రిబుల్ ఐటీని తరలించవద్దని నిరసన

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట పరిధిలోని ఎస్ఎన్ఎన్ కళాశాల త్రిబుల్ ఐటీ కేంద్రాన్ని ఒంగోలు నుంచి కనిగిరికి తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు గురువారం ధర్నా చేపట్టారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఏపీ విద్యార్థి విభాగం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్