ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించేందుకు పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించారు. మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి, స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. కొన్ని ప్రాంతాలలో జరిమానా విధించి, కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.