ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు గ్రామ సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ హాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.