నిందితులకు రక్షణగా వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఎస్పీ వి. హర్షవర్ధన్రాజు మంగళవారం రాత్రి వారిని వీఆర్ కు పిలిచారు. చీమకుర్తి పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు విజయ్, రామంజనేయులను వెంటనే హెడ్క్వార్టర్లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 2న ఐదుగురు నిందితులకు చీమకుర్తి నుంచి ఎస్కార్ట్ వచ్చిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మరియ బాబు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు కారణమయ్యారు. ఈ మేరకు ఎస్పీ విచారణ చేసి వెంటనే ఇరువురు కానిస్టేబుళ్లను వీఆర్ కు పిలిచి, వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.