బైకును కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

నాగులుప్పలపాడులో శనివారం అర్ధరాత్రి చేకూరపాడు వద్ద 216వ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి చేకూరపాడు గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న తెనాలిలోని ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజరు చప్పిడి ప్రభాకరరావు, ఆయన సతీమణి భాను గ్రామంలోకి వెళ్లేందుకు పక్కకు తిరుగుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్