ప్రకాశం జిల్లా మద్దిపాడులో శుక్రవారం గుండ్లపల్లి పరిశ్రమలకేంద్రం దగ్గర స్కూటీ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో మార్టూరుకు చెందిన డి. రత్నకుమారి అనే మహిళ గాయపడ్డారు. ఆమెను చికిత్స కోసం ఒంగోలులోని వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై తమకు ఎటువంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.