రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియవలసి ఉందని పోలీసులు అన్నారు. జరిగిన ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్