దోర్నాలలో గంటల్లోనే బ్యాగు పట్టివేత

మార్కాపురం జిల్లా దోర్నాల బస్టాండ్లో బుధవారం ఓ వృద్ధుడు తన బ్యాగ్ను పోగొట్టుకున్నాడు. అందులో రూ. 6 వేల నగదు, బ్యాంకు పుస్తకాలు ఉండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఏఎస్ఐ పోలురాజు స్పందించి, బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి ఆధారంగా గంటల వ్యవధిలో ఆ బ్యాగ్ను గుర్తించి వృద్ధుడికి తిరిగి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్