యర్రగొండపాలెం లో రేపటి నుండి జాతీయ స్థాయి పోటీలు

యర్రగొండపాలెం లో సంక్రాంతి పండుగ సందర్భంగా, వైసిపి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రేపటి నుండి జాతీయ స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించనున్నారు. ఈ పందాలు నాలుగు కేటగిరీల్లో నాలుగు రోజుల పాటు జరుగుతాయి. సీనియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు లక్ష యాభై వేల రూపాయల మొదటి బహుమతితో పాటు, పాల్గొన్న అన్ని ఎడ్లకు ప్రోత్సాహకంగా రూ. 15 లక్షల నగదు బహుమతి అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి ఇచ్చే ప్రాధాన్యతకు తగ్గట్టుగా యర్రగొండపాలెం కు పేరు తెచ్చేలా ఈ పందాలను నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పందాలు జరిగే మైదానాన్ని పరిశీలించి, వాలంటీర్లకు ఇచ్చే టీ-షర్టులను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్