మార్కాపురం జిల్లా దోర్నాల - ఆత్మకూరు ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న ద్విచక్ర వాహనం, శ్రీశైలం నుంచి బెంగళూరు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న దాసరి అంకన్న, ఆర్తి నాగన్నలకు గాయాలవడంతో, 108 సిబ్బంది వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.