త్రిపురాంతకం మండలం ముడివేములకు పోవు రోడ్డు సమీపంలో చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను వేస్తున్నారని, ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను చేపలకు మేతగా వేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.