సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ

ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం, టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు 55 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి సీఎం చంద్రబాబు రూ. 56 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేశారని ఇన్ ఛార్జ్ తెలిపారు. పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్