సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 29 మందికి రూ. 36.90 లక్షల విలువైన చెక్కులను ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు అందించారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్