మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ను తెలంగాణలో పోలీసులు మెడ పట్టుకుని నెట్టారని ఆ వీడియోను టిడిపి కార్యకర్త సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశాడని వైసిపి నాయకులు బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బెదిరింపులకు సంబంధించిన ఫోన్ రికార్డింగ్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బెదిరించిన వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.