ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో శుక్రవారం స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఒంటరి మహిళలకు నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో పెన్షన్ తీసుకుంటూ మృతి చెందిన వ్యక్తి భార్యకు మరుసటి నెల నుంచే పెన్షన్ అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టబోతుందని ఎరిక్షన్ బాగాబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఇన్ ఛార్జ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.