యర్రగొండపాలెం లో సోమవారం చెత్త సేకరించే స్వచ్ఛ రథాలను స్థానిక టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది కష్టపడతారని, ఈ రథాల ద్వారా చెత్తను సేకరించి ఊరికి దూరంగా తీసుకువెళ్లి సంపదగా మారుస్తారని ఆయన తెలిపారు. ప్రజలు కూడా తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేసి స్వచ్ఛ రథాలలో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.