ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు ఎస్సి పాలెంలో సోమవారం టిడిపి. ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మరి కొన్ని పథకాలు అతి త్వరలో ప్రజలందరికీ అందుతాయని ఎరిక్షన్ బాబు అన్నారు.