మొక్కజొన్న ప్రభుత్వం కొనుగోలు చేయాలి: రైతులు

రబీ సీజన్లో 13 జిల్లాల్లో 12.50 లక్షల ఎకరాల్లో సాగైన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బాణాల రామయ్య డిమాండ్ చేశారు. యర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేపట్టాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్