వెలుగొండ ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రజలను మోసం చేశారు

ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని ప్రజలను జగన్ మోసం చేశారని మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోర్నాల మండలంలో ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంకా 30% పనులు మిగిలి ఉన్నాయని, ఏప్రిల్ లేదా మే 10 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. నిర్వాసితులకు ఏప్రిల్ నుంచి పరిహారం చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి, యర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్