దోర్నాలలో చిరుత సంచారం

ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో చిరుతపులి సంచరిస్తుందన్న వార్తలు కలకలం రేపాయి. స్థానిక కేజీబీవీ వెనుక పంట పొలాల్లో శుక్రవారం చిరుత తిరుగుతుందని రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన దోర్నాల అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాతో దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే, దాని జాడ ఎక్కడా కనిపించలేదని, శనివారం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని అటవీ క్షేత్రాధికారి హరి తెలిపారు.

సంబంధిత పోస్ట్