చెట్టుపై పిడుగు, స్థానికులు బెంబేలు

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో గ్రామంలోని ఇళ్ల మధ్య ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు మంటల్లో చిక్కుకుంది. మంటలు, నిప్పు రవ్వలు కింద పడుతుండటంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుమారు గంట తర్వాత మంటలు ఆరిపోవడంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లారు. ఊరి మధ్యలో ఇలా పిడుగు పడటం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు తెలిపారు. ప్రాణనష్టం జరగనందుకు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్