లారీ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీ

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడు సమీపంలోని నేషనల్ హైవేపై శనివారం తెల్లవారుజామున లారీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలవడంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు వారందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు కాకినాడ నుంచి శ్రీశైలం వెళ్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్