కారు ఢీ కొట్టిన లారీ, తప్పిన ప్రమాదం

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వెనకనుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. అయితే, అదృష్టవశాత్తు ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లారీ డ్రైవర్ అతివేగంతో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్