ఈ నెల 27, 28 తేదీల్లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మంగళవారం తెలిపారు. నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు, రాష్ట్ర స్థాయి మహానాడుకు ఏమాత్రం తగ్గకుండా అన్ని వసతులతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీడీపీ నేతాలంతా భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.