మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో హైదరాబాద్ రహదారిపై బైకు అదుపుతప్పి రైతు నాగుల అమరలింగయ్య (39) మృతిచెందాడు. పనిపై పల్నాడు జిల్లా దావపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా, అతివేగం కారణంగా కల్వర్టును ఢీకొని సుమారు 20 అడుగులు ఎగిరిపడి అక్కడికక్కడే మరణించాడు. సోదరుడు గాలించగా మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ సంపత్కుమార్ తెలిపారు.