ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మురికిమల్ల తండా వద్ద సోమవారం ట్రాక్టర్ బోల్తా పడి చెన్నంపల్లికి చెందిన చిన్న గురవయ్య మృతి చెందారు. పల్నాడు జిల్లా నుంచి బంతి పూలను మల్లెపాలెం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.