పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్ తో ధర్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అతను నంద్యాల జిల్లా మహానంది మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కూలి పనులు చేస్తున్న సమయంలో ధర్మయ్య విద్యుత్ షాక్ కు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.