అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సుందరయ్య కాలనీలో మంగళవారం మర్రిపాలెం గూడేనికి చెందిన ధ్వంశం పోలయ్య (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నెలల తరబడి మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భార్య భయమ్మ మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పట్లో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే, పోలయ్య మళ్ళీ మద్యం సేవించడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పోలయ్య మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్