పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పక్కకు తొలగించడం పై వైసీపీ నాయకులు అభ్యంతర వ్యక్తం చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ కు వైసిపి నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. రోడ్డు విస్తరణ పనులలో భాగంగా వైయస్సార్ విగ్రహాన్ని తొలగించవలసిన అవసరం లేదని వైసిపి నాయకులు కలెక్టర్ ను కోరారు.