పంట నష్టం పై ఎమ్మెల్యే ఆగ్రహం

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని వై. కొత్తపల్లి వద్ద ఆకాల వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి తోటలను వైసిపి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. బొప్పాయి, అరటి, మిర్చి రైతులు పండించిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులకు అధికారులు అంచనాలు వేయకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తీరుతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్