మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో ప్రధాన రహదారులు, వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న జంతువుల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ జంతువులు అటుగా వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని, ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. శుక్రవారం కేజీ రోడ్డుపై వాహనదారులపై దాడులు చేశాయని ప్రజలు తెలిపారు.