టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం గ్రామంలోని 25వ బూతులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగులకు రూ.6,000, వితంతువులకు రూ.4,000 చొప్పున పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ కార్యదర్శి మత్తలూరి మల్లికార్జున చారి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.