పుల్లలచెరువు: బెల్లం ఉటా ధ్వంసం

పుల్లలచెరువు మండలం పెద్దపిఆర్సితండా అటవీ ప్రాంతంలో మంగళవారం నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 260 లీటర్ల బెల్లంఊటను గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నామని ఇప్పటికే 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్