పుల్లలచెరువు-గంగవరం అడ్డరోడ్డు మధ్యలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి కళ్యాణం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కళ్యాణాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్నదానం చేశారు.గురువారం పుల్లల చెరువు ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.