వీడియో ఫార్వర్డ్ చేశాడని టిడిపి కార్యకర్తకు బెదిరింపు

యర్రగొండపాలెం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అజరుద్దీన్‌ను వైసీపీ నాయకులు బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చంద్రశేఖర్ నిరసన చేస్తున్నప్పుడు, తెలంగాణ పోలీసులు నెట్టే క్రమంలో మెడపట్టుకున్న సంఘటనకు సంబంధించిన వీడియోను అజరుద్దీన్ సోషల్ మీడియాలో వైరల్ చేశారని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం ఫోన్ చేసి అజరుద్దీన్‌ను బెదిరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారంలో లేకుండానే ఇలా బెదిరింపులకు పాల్పడుతుంటే, అధికారంలో ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్