గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయిన పొగాకు

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం పందివానిపల్లి గ్రామంలో రూ. 5 లక్షల విలువైన 30 క్వింటాల పొగాకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటల్లో దగ్ధమైంది. రైతు మల్లికార్జున రెడ్డి అప్పు చేసి పెట్టుబడి పెట్టిన పొగాకు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన కుటుంబం వాపోయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్