మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన రచయిత, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, గుంటూరు ప్రాంతాలను పరిపాలించిన జమీందారు అని, వాసిరెడ్డి రాజులలో ప్రసిద్ధి చెందిన ప్రభువు, అమరావతి సంస్థాన పాలకుడు, కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడని కొనియాడారు.