ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త అన్న సముద్రం ఎస్సీ పాలెం లో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు షాక్ తో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు, జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు అందవలసి ఉంది.