ఆ ఎమ్మెల్యే పై చర్యలేవి: ఎమ్మెల్యే చంద్రశేఖర్

తాడేపల్లిలో వై. పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, అరవ శ్రీధర్ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన టీడీపీ నుంచే వచ్చారని ఆరోపించారు. ఒక మహిళను కొట్టి లోబర్చుకున్న కూటమి ఎమ్మెల్యేపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదని, మహిళా హోం మంత్రి ప్రతిపక్ష నేతను అపహాస్యం చేస్తూ ట్వీట్లు వేయడంలో బిజీగా ఉన్నారా అని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్