యర్రగొండపాలెం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. 15 మందికి గాయాలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మార్కాపురం అడ్డా రోడ్డు సమీపంలో బొలెరో, మినీ లారీ ఢీకొన్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఘటనలో ఒకరు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను నరసరావుపేటకు తరలించారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్