ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద బుధవారం పెద్దపూడి సురేందర్ రెడ్డి (బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థి) నాగార్జున సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారి పడి గల్లంతయ్యాడు. బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు అతడి కోసం కాలువలో గాలిస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.