AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. హిందీ రాజ్యభాష అని, తెలుగు భాష అమ్మ అయితే.. హిందీ భాష పెద్దమ్మ లాంటిందని పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శలకు దిగారు. ‘ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛి.. ఛీ.. #justasking’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్‌ను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.