ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్ సంభాషణ.. ఆడియో వైరల్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రశ్న రావణ్ అరెస్టుపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ క్రమంలో ప్రశ్న రావణ్‌తో ఆయన ఫోన్‌లో సంభాషించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రిలీజ్ చేశారు. మతాలు, కులాలను రెచ్చగొట్టే విధంగా ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో ఈ తరహా  సంభాషణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

సంబంధిత పోస్ట్