AP: నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘాటుగా స్పందించారు. అనిల్ మంత్రి పదవి పోయినప్పటి నుంచి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఆయన రెండేళ్ల మంత్రి పదవి కాలంలో చేసిన దందాలకు తమ వద్ద పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని ప్రశాంతి రెడ్డి ఆరోపించారు. మైనింగ్, క్వార్జ్ వ్యాపారాల్లో చేసిన అక్రమాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. గతంలో వేమిరెడ్డి వద్దకు వచ్చి సాయం కోరిన సంగతి అనిల్ మర్చిపోయారా అని నిలదీశారు.