AP: తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం మండలంలో వేళ్లచింతలగూడెంలో విషాదం చోటుచేసుకుంది. పురిటినొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణి లక్ష్మీ(33)కి ఆపరేషన్ కోసం మత్తు మందు ఇవ్వగా పరిస్థితి విషమించింది. రాజమహేంద్రవరం తరలించగా చికిత్స పొందుతూ కడుపులో బిడ్డతో సహా మృతి చెందింది. పెద్దాపురానికి చెందిన నాగుతో 12 ఏళ్ల క్రితం పెళ్లి కాగా పదేళ్ల కుమార్తె ఉంది. మత్తు మందు వికటించడం వల్లనే చనిపోయిందని కుటుంబీకుల ఆరోపణ చేస్తున్నారు.